అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. స్వర్ణాంధ్ర
Actor ProfilePolitician

అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. స్వర్ణాంధ్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. స్వర్ణాంధ్ర-20247లో అందరూ భాగస్వామ్యం కావాలన్న సీఎం చంద్రబాబు
Samayam Telugu22 Dec 2026
అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. స్వర్ణాంధ్ర-20247లో అందరూ భాగస్వామ్యం కావాలన్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్స్‌లో తొలిసారిగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయజెండాను ఎగుర వేశారు. అనంతరం రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు చంద్రబాబు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా నిర్మించడమే మహానీయుల త్యాగాలకు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా ఉండాలి.. గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలన్నారు. స్వాతంత్ర్య సమరంలో తెలుగు నేలకు ముఖ్య పాత్రం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రతి పౌరుడు 'నా దేశం, నా బాధ్యత' అని ముందుకుసాగాలన్నారు ముఖ్యమంత్రి. 'దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి నేను ఏం చేయగలను' అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 2047 నాటికి వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంలో భాగస్వామ్యం అవ్వాలన్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనే నాటికి దేశం, రాష్ట్రం వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలిపేందుకు అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు.. వచ్చే 20 ఏళ్లు కష్టపడి పనిచేయాలన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నోసార్లు సవాళ్లు, సంక్షోభాలు ఎదురయ్యాయని.. గత పాలకులు ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో కూటమికి రాష్ట్ర ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని.. కూటమి ప్రభుత్వ పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగు వేస్తున్నామన్నారు. ఏపీకి కేంద్రం సహకారంతో కొత్త ఊపిరి వచ్చిందని.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా 10 సూత్రాలతో పాలన చేస్తున్నామన్నారు. ఈ లక్ష్యసాధన కోసం కార్యాచరణను సిద్ధం చేసుకుని.. ప్రతి గ్రామం, ప్రతి జిల్లా అభివృద్ధి చెందేలా ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో.. విశాఖపట్నం