
గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా (Dr. Raja) కుమారుడి వివాహ వేడుకలు అమెరికా (America)లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), తన సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmani)తో కలిసి హాజరయ్యారు. వివాహ వేడుకలో నూతన వధూవరులను నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. లోకేశ్ దంపతులు తమ కుటుంబ వివాహ వేడుకకు హాజరు కావడంతో డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి, బిజీ షెడ్యూల్‌లోనూ ప్రత్యేకంగా సమయం కేటాయించి అమెరికా వచ్చి వివాహా వేడుకలో పాల్గొన్న లోకేశ్‌కు డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు
