అమెరికా మాత్రమే కాదు.. మాకు భారత్ అనే గొప్ప మిత్రదేశం ఉంది
Actor ProfileCelebrity

అమెరికా మాత్రమే కాదు.. మాకు భారత్ అనే గొప్ప మిత్రదేశం ఉంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెరికా మాత్రమే కాదు.. మాకు భారత్ అనే గొప్ప మిత్రదేశం ఉంది
AP7AM24 Sept 2026
అమెరికా మాత్రమే కాదు.. మాకు భారత్ అనే గొప్ప మిత్రదేశం ఉంది

ఇజ్రాయెల్‌కు అమెరికా ఒక్కటే బలమైన మిత్రదేశం కాదని, భారత్‌ సహా మరికొన్ని దేశాలు కూడా తమకు గట్టి మద్దతుగా నిలుస్తున్నాయని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘‘మాకు భారత్‌ అనే గొప్ప మిత్రదేశం ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న ఆ దేశం నుంచి అపారమైన మద్దతు లభిస్తోంది. సోషల్‌ మీడియాలో భారతీయుల నుంచి వేల సంఖ్యలో మద్దతు సందేశాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.అనేక దేశాల నేతలు తమకు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి మద్దతు తెలుపుతున్నారని నెతన్యాహు వెల్లడించారు. తమ దేశాల్లో ప్రజాభిప్రాయం కారణంగా బహిరంగంగా చెప్పలేకపోయినా.. రక్షణ, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ టెక్నాలజీ వంటి రంగాల్లో ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.గత నెలలో వాన్స్‌ మాట్లాడుతూ.. ‘‘ఇజ్రాయెల్‌కు ఇప్పుడు మిగిలిన ఏకైక శక్తిమంతమైన మిత్రదేశం అమెరికానే’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ నేతలు విమర్శించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు తాజా వ్యాఖ్యలను వాన్స్‌ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు