
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజే (Diljit Dosanjh) అమెరికా పౌరసత్వం తీసుకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన సరదాగా స్పందించారు. ఇటీవల లైవ్‌లో అభిమానులతో మాట్లాడిన దిల్జిత్.. గ్రీన్ కార్డు గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘నేను ఒక కార్డు తీసుకుని దానికి గ్రీన్ కలర్ వేస్తాను. నేను దీనిపై ఇంకేం మాట్లాడను. వీసా లేకుండా అందరూ ఏ దేశానికైనా వెళ్లే స్వేచ్ఛ ఉండాలి. ప్రపంచమంతా ఒక్కటి కావాలి’’ అని ఆయన అన్నారు. అయితే, దిల్జిత్ 2022లోనే అమెరికా పౌరసత్వం తీసుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా ఈ వార్తలను ఆయన నేరుగా ఖండించలేదు.. అంగీకరించలేదు. మరోవైపు, దిల్జిత్ నటించిన తాజా చిత్రం ‘సత్లుజ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’లో ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలై, కేవలం రెండు రోజుల్లోనే తొలగించడంతో వైరల్‌గా మారింది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖాల్రా జీవితం ఆధారంగా హనీ ట్రెహాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్తవానికి దీనికి ‘పంజాబ్ 95’ అని పేరు పెట్టారు. 1984 నుంచి 1994 వరకు పంజాబ్‌లో వేలాది గుర్తుతెలియని మృతదేహాలకు దహన సంస్కారాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై జస్వంత్ సింగ్ దర్యాప్తు చేశారు. ఈ అంశంపై సినిమా తీయడంతో సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏకంగా 127 కట్స్ చెప్పడంతో ఈ సినిమా మూడేళ్లుగా విడుదలకు నోచుకోలేదు. గతంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ సినిమా ప్రదర్శనను రద్దు చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా