అమెరికా నేల
Actor ProfilePolitician

అమెరికా నేల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెరికా నేలపై తెలుగు వైభవం.. అట్టహాసంగా ముగిసిన 'ఆటా' వేడుకలు
Zee Telugu18 Nov 2026
అమెరికా నేలపై తెలుగు వైభవం.. అట్టహాసంగా ముగిసిన 'ఆటా' వేడుకలు

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. ATA Mahasabhalu 2026: అమెరికా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో ATA 2026 మహాసభలు ఘనంగా ముగిశాయి. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు-యువజన సదస్సు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉత్తర అమెరికాతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిమంది ప్రవాస తెలుగు ప్రజలు, వృత్తి నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, సాంకేతిక రంగ నాయకులు, కళాకారులు, రచయితలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సామాజిక సేవ, పారిశ్రామిక ప్రగతి, యువజన భాగస్వామ్యానికి అద్దం పట్టాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ మహాసభలు సాంస్కృతిక, సామాజిక, వ్యాపార, యువజన కార్యక్రమాలతో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తర అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి వేలాదిమంది తెలుగు ప్రజలు ఈ మహాసభలకు హాజరై తెలుగు సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్శించారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా హష్మీ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు పాల్గొనడం ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరితో పాటు తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ తెలుగు, భారతీయ అమెరికన్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొని ఆటాకు మద్దతు తెలిపారు. తెలుగు గొప్పతనానికి ప్రతిబింబం ప్రారంభ వేడుకలు, గ్రాండ్ బాంక్వెట్ నుంచి ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీత విభావరి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య చర్చలు, వ్యాపార