అమెరికా కాంగ్రెస్ పోరులో భారత సంతతి విద్యావేత్త రికార్డు
Actor ProfilePolitician

అమెరికా కాంగ్రెస్ పోరులో భారత సంతతి విద్యావేత్త రికార్డు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెరికా కాంగ్రెస్ పోరులో భారత సంతతి విద్యావేత్త రికార్డు
Sakshi13 Jan 2027
అమెరికా కాంగ్రెస్ పోరులో భారత సంతతి విద్యావేత్త రికార్డు

వాషింగ్టన్: ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ డెమొక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన విద్యావేత్త పియా దాండియా ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ప్రైమరీ పోరులో న్యాయవాది కేసియా ఎర్లీని ఓడించి ఆమె డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, వ్యాపారవేత్త, మెరైన్ వెటరన్ అయిన కేసీ అస్కార్‌తో ఆమె తలపడనున్నారు. ఈ విజయం అనంతరం పియా దాండియా మాట్లాడుతూ.. ‘నా స్వరాష్ట్రమైన ఫ్లోరిడాలో యూఎస్ కాంగ్రెస్‌కు డెమొక్రాటిక్ నామినీగా నిలవడం చాలా గౌరవంగా ఉంది. శ్రామిక కుటుంబాల పక్షాన పోరాడేందుకు మా ప్రచారం తదుపరి దశలోకి ప్రవేశించింది’ అని అన్నారు. ఎవరీ పియా దాండియా? పామ్ బీచ్ కౌంటీలో జన్మించిన పియా దండియా తొలి తరం అమెరికన్. ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, 28 ఏళ్ల వయస్సులోనే హార్లెమ్‌లో హైస్కూల్‌ను స్థాపించి దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రిన్సిపాల్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు. అనంతరం డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్, విద్యా శాఖల్లో వైట్ హౌస్ ఫెలోగా విధులు నిర్వర్తించారు. ఆపిల్ సంస్థలో విద్య, వైద్య సంబంధిత ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పనిచేశారు. కాంగ్రెస్‌కు ఎన్నికైతే ఫ్లోరిడా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా రికార్డు సృష్టించినవారవుతారు. నియోజకవర్గ సమీకరణలు పునర్విభజన జరిగిన 22వ డిస్ట్రిక్ట్ బ్రొవార్డ్.. పామ్ బీచ్, హెండ్రీ, కొల్లియర్ కౌంటీలను కలుపుకుని విస్తరించింది. నిత్యావసరాల ధరల తగ్గింపు, పబ్లిక్ స్కూళ్ల బలోపేతం, వృత్తి విద్యా శిక్షణ, సోషల్ సెక్యూరిటీ రక్షణ ప్రధాన అజెండాగా ఆమె ప్రచారం సాగుతోంది. ఈ స్థానం ఫలితం యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆధిపత్యాన్ని నిర్దేశించే కీలక పోరుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికాలో కూలిన బంగారు గని.. 30 మంది దుర్మరణం చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో