
JD Vance | ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా దుర్వినియోగాలకు పాల్పడే వారిపై అమెరికా చేపట్టిన చర్యలపై అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) స్పందించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని పునరుద్ఘాటించారు. వీసా మోసాలకు పాల్పడే వారిపై అమెరికా కార్మిక శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. విస్కాన్సిన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్ మాట్లాడుతూ.. ‘‘అత్యున్నత ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు వీలుగా హెచ్-1బీ వీసాను రూపొందించాం. కానీ, కొన్ని పెద్ద కంపెనీలు, వ్యక్తులు ఈ వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుని అమెరికా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము కాపాడటంతో పాటు వీసా దుర్వినియోగాన్ని అరికట్టడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యం. వీసా దుర్వినియోగం చేసేవారిని ఇకపై ఉపేక్షించబోం. అలాంటి వారికి అమెరికాలోకి ప్రవేశం ఉండదు. వీసా వ్యవస్థలో మోసాలను అరికట్టేందుకు కార్మిక శాఖ విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోంది’’ అని స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు