అమ్మాయిలతో మూత్రం తాగించిన 5వ తరగతి విద్యార్థి..ప్రిన్సిపల్ కి చెబితే చాక్లెట్స్ తినమన్నాడు
Actor ProfilePolitician

అమ్మాయిలతో మూత్రం తాగించిన 5వ తరగతి విద్యార్థి..ప్రిన్సిపల్ కి చెబితే చాక్లెట్స్ తినమన్నాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమ్మాయిలతో మూత్రం తాగించిన 5వ తరగతి విద్యార్థి..ప్రిన్సిపల్ కి చెబితే చాక్లెట్స్ తినమన్నాడు
Zee Telugu13 Jan 2027
అమ్మాయిలతో మూత్రం తాగించిన 5వ తరగతి విద్యార్థి..ప్రిన్సిపల్ కి చెబితే చాక్లెట్స్ తినమన్నాడు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. MP School Urine Controversy: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సదరు స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న ఓ బాలుడు వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపి తన క్లాస్‌లో ఉన్న ఇద్దరు బాలికలతో తాగించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వారికి ఊరట కోసం రూ.10 విలువైన చాక్లెట్ తినమని చెప్పారని ఒక అధికారి తెలిపారు. గుణా జిల్లాలోని అరోన్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సోమవారం అనగా ఆగస్టు 17న ఈ ఘటన జరిగింది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించి, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశారు. బాధిత బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు మంగళవారం పాఠశాల వద్ద ఆందోళన చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "కొంతమంది విద్యార్థులు నీళ్ల బాటిళ్లలో ఉన్న మూత్రాన్ని తమతో తాగించారని ఇద్దరు బాలికలు ఆరోపించారు. వారు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అమానుషంగా ప్రవర్తిస్తూ 'మీ నోటి రుచి బాగోలేకపోతే, రూ.10 చాక్లెట్ తినండి' అని అన్నారని తెలిసింది" అని గునా జిల్లా మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్ కన్యాల్ చెప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే తహసీల్దార్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)ను అక్కడికి పంపించామని, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశామని అరోన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) మంజుషా ఖత్రీ తెలిపారు. రెండు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని BEOను ఆదేశించారు. ఆ నివేదిక