అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ’ ఎవరు
Actor ProfilePolitician

అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ’ ఎవరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ’ ఎవరు
Eenadu8 Jan 2027
అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ’ ఎవరు

Shehzad Bhatti| ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్, వ్యాపారవేత్త.. ఈ ముసుగులో భారత్‌లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోన్న షహజాద్ భట్టీకి భద్రతా బలగాలు చెక్ పెట్టాయి. అతడి నెట్‌వర్క్‌ను భూస్థాపితం చేశామని ఏకంగా కేంద్రహోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రకటించారు. పాకిస్థాన్‌ (Pakistan) లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన షహజాద్ భట్టీ (Shehzad Bhatti).. దోపిడీలతో మొదలు పెట్టి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. లాహోర్ అండర్‌వరల్డ్ నెట్‌వర్క్‌లో అతడి పేరు వినిపించింది. 2013లో పోలీసులు అతడిపై పలు కేసులు నమోదు చేశారు. తర్వాత అతడు పాక్ నుంచి యూఏఈకి మకాం మార్చాడు. స్క్రాప్‌ సహా పలు వ్యాపారాలు ఉన్నాయని ప్రచారం చేసుకునేవాడు. పాకిస్థాన్‌లో టిక్‌టాక్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. మతపరమైన అంశాలు, జాతీయవాదం, ఇతర వివాదాస్పద అంశాలను పోస్టు చేస్తూ.. భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ‘333’ పేరిట షహజాద్ భట్టీ గుర్తింపు పొందాడు. భారత్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుడని చెప్తూ ఉండేవాడు. 2025లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత బిష్ణోయ్-భట్టీ బంధం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అప్పుడు పాక్‌కు వ్యతిరేకంగా బిష్ణోయ్ వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. తొలి నుంచి భట్టీ (Shehzad Bhatti) అనుమానాస్పద కార్యాకలాపాలపై భారత దర్యాప్తు బృందాలు ఒక కన్నేసి ఉంచాయి. ప్రముఖ నటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తితోపాటు పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లపై బెదిరింపులకు తెగబడ్డాడు. 2024, మార్చిలో పంజాబ్‌లోని జలంధర్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్ రోజర్ సంధు నివాసం వద్ద గ్రనేడ్ దాడి చేయడంతో దర్యాప్తు బృందాలు అతడిపై మరింత దృష్టిసారించాయి. ఈ గ్రనేడ్ దాడికి భట్టీనే కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడికి పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్‌ (ISI)తో సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగ యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించేలా చేసి, భారత్‌లో తన ప్రభావాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు