అప్పట్లో ఈ సాంగ్ ఓ ట్రెండ్ సెట్టర్.. 90' కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా
Actor ProfileActor

అప్పట్లో ఈ సాంగ్ ఓ ట్రెండ్ సెట్టర్.. 90' కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అప్పట్లో ఈ సాంగ్ ఓ ట్రెండ్ సెట్టర్.. 90' కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా
TV9 Telugu15 Oct 2026
అప్పట్లో ఈ సాంగ్ ఓ ట్రెండ్ సెట్టర్.. 90' కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా

కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ ఉంటాయి. అలాగే కొన్ని పాటలు సైతం ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ సాంగ్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఆ పాటలు దూసుకుపోతున్నాయి. అలాంటి క్లాసిక్ హిట్ సాంగ్ ఇదే. అదే “నువ్వు యాడికెళ్తే ఆడికోస్తా సువర్ణ” సాంగ్. ఒకప్పటి లవర్ బాయ్ రోహిత్, అనితా పాటిల్ జంటగా నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలోనిది ఈ పాట. 2002లో విడుదలైన ఈ చిత్రం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాట సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పాటలోని బీట్, లిరిక్స్ చాలా క్యాచీగా ఉంటాయి. “నువ్వు యాడికెళ్తే నేను ఆడకొస్తా” అనే లైన్ అప్పట్లో ప్రతి ఒక్కరి నోటా వినపడేది. ముఖ్యంగా 90’s కుర్రాళ్లు ఈ పాటను తెగ పాడుకునేవారు. అమ్మాయిలను ఆటపట్టించడానికి.. కాలేజీలలో ఫేర్ వేల్ పార్టీలలో ఈ పాట జోరు మాములుగా ఉండేది కాదు. ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు.. గ్రామీణ, పట్టణ యువతను ఆకట్టుకునేలా ఈ పాటను కంపోజ్ చేశారు. రోహిత్ ఎనర్జిటిక్ స్టెప్స్, అనితా పాటిల్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను విజువల్‌గా కూడా సూపర్ హిట్ చేశాయి. అప్పట్లో లవర్స్ మధ్య ఉండే సరదా గొడవలు, ప్రేమను ఈ పాటలో చాలా చక్కగా చూపించారు.ఈ సాంగ్ విడుదలైన ఇన్నేళ్లయినా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. . ఇప్పటికీ పాత జ్ఞాపకాలను (Nostalgia) ఇష్టపడే సంగీత ప్రియులు ఈ పాటను లూప్‌లో వింటుంటారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ కాలంలో ఇలాంటి పాత హిట్ సాంగ్స్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వస్తూ నేటి తరం యువతకు కూడా చేరువవుతున్నాయి. ఎక్కువ మంది చదివినవి : Murali Mohan