అన్ని విధాలా న్యాయం జరిగేలా కృషి చేస్తా
Actor ProfilePolitician

అన్ని విధాలా న్యాయం జరిగేలా కృషి చేస్తా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్ని విధాలా న్యాయం జరిగేలా కృషి చేస్తా
Eenadu10 Dec 2026
అన్ని విధాలా న్యాయం జరిగేలా కృషి చేస్తా

ధర్మపురి గ్రామీణం: వీబీజీ రాంజీలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో పలువురు మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. పే స్కేల్ అమలు చేసేలా రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరారు. అన్ని విధాలా న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం రమేశ్‌, సభ్యులు ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు