అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Actor ProfilePolitician

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Sakshi18 Nov 2026
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్‌ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్‌ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి