అధునాతన అగ్నిమాపక వాహనాలు.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

అధునాతన అగ్నిమాపక వాహనాలు.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అధునాతన అగ్నిమాపక వాహనాలు.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Eenadu19 Dec 2026
అధునాతన అగ్నిమాపక వాహనాలు.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర అగ్నిమాపకశాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు రానున్నాయి. తాజాగా 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) జెండా ఊపి ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలు.. 20 వాటర్‌ బౌజర్లు.. 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను లాంచ్‌ చేశారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్‌ బౌజర్లు కొనుగోలు చేసింది. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లోకి వేగంగా చేరుకునేలా 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అధికారులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పరజపాడులో అరుదైన ఘటన జరిగింది