కుకు విత్ జాతిరత్నాలు షోలో నేటి (జూలై 11) ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగింది. విలన్ థీమ్‌తో వచ్చిన ఈ ఎపిసోడ్‌లో అవినాష్, నూకరాజు కామెడీతో అదరగొట్టేశారు. ఎప్పటిలానే రీతూ, సుహాసిని గుంపులో గోవింద అన్నట్టుగా సాగింది. మణికంఠను మాత్రం అందరూ ఆడేసుకున్నారు. ఇక అవినాష్ అయితే జయ ప్రకాష్ రెడ్డిలా నటించేందుకు చాలానే కష్టపడ్డాడు. పోకిరి సినిమాలో అలీ భాయ్‌లా నూకరాజు ట్రై చేశాడు. జాతిరత్నాలు కామెడీతో అందరినీ నవ్విస్తే.. కుక్స్ తమ చేతివంటలతో జడ్జ్‌లను మెప్పించారు.పెయిరింగ్ టాస్కులో ఒక్కరికి బ్యాండ్‌లు పెట్టడం, వద్దని అనుకున్న జాతిరత్నాల నంబర్లను నొక్కుతూ ఉంటే.. అక్కడ వారు వైబ్రేట్ అవుతూ ఉండటంతో టాస్క్ ఫన్నీగా సాగింది. ప్రదీప్ కూడా కుక్స్‌తో పాటుగా జాతిరత్నాలను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అవినాష్, సుహాసిని ఇలా అందరినీ వైబ్రేషన్ పెట్టి వణికించాడు. అడ్వాంటేజ్ టాస్కులో రాకేష్‌కి నూకరాజు, తనూజకు అవినాష్, పవన్‌కి సుహాసిని, ఆషికకి మణికంఠ, పునర్నవికి రీతూ వచ్చారు. వీరంతా కలిసి విలన్ థీమ్‌కి తగ్గట్టుగా స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేశారు.పునర్నవి.. లెబనీస్ వంటకాలు అంటూ.. లెమన్ జతార్ సాల్మన్, బార్లీ కతుర్ సాలడ్, కిబీర్ చేసింది. జడ్జ్‌లు వాటిని టేస్ట్ చేసి డిఫరెంట్‌గా, కొత్తగా బాగుందని మెచ్చుకున్నారు. పవన్ చేసిన పైనాపిల్ కర్రీ, కొబ్బరి అరికెల అన్నం, బుజ్జీ ఆలూ బాగుందని అన్నారు. రాకేష్ మాత్రం చాలా కొత్తగా ట్రై చేశాడని, అసలు ఇలాంటి ఊహించలేదు అని ఫైర్డ్ గ్రిల్ డిస్కో పంప్కిన్ మైకెన్ చీజ్ బ్లెడీమెరీని మెచ్చుకుంది శ్రీదేవీ. కాకపోతే కిచెన్ క్లీన్‌గా లేదు అని మార్కులు కట్ చేస్తానని సంజయ్ వార్నింగ్ ఇచ్చాడు. తనూజ చేసిన మటన్ జ్యూసీ మండీ..చికెన్ కబాబ్, మటన్ సూప్‌లను జడ్జ్‌లు టేస్ట్ చేసి అవాక్కయ్యారు. మరీ ముఖ్యంగా మటన్ సూప్ నెక్ట్స్ లెవెల్ అని అలీ, సంజయ్ అలా అందరూ మెచ్చుకున్నారు. చివర్లో ఆషిక చేసిన సాల్టెడ్ క్యారెమెల్
Actor ProfileActor
అదరగొట్టిన తనూజ.. వెనకబడ్డ డెమాన్ పవన్.. ఎవరి స్కోర్ ఎంతంటే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•28 Oct 2026
అదరగొట్టిన తనూజ.. వెనకబడ్డ డెమాన్ పవన్.. ఎవరి స్కోర్ ఎంతంటే