
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Mines in Telangana: తెలంగాణ రాష్ట్రం ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి.. సింగరేణి కాలరీస్ కంపెనీ తెలంగాణకు ఆభరణం వంటిది. దేశంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు గోదావరి లోయలో ఉన్నాయి. బొగ్గు తర్వాత, సిమెంట్ పరిశ్రమకు కీలకమైన సున్నపురాయి, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తరించి ఉంది. అంతేకాదు.. తెలంగాణ గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలలో నలుపు , పసుపు గ్రానైట్ మార్బుల్ ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. బరైట్, డోలమైట్, తెల్ల మట్టి వంటి ఖనిజాలు కూడా తెలంగాణలోని అనేక ప్రాంతాలలో లభిస్తాయి. అయితే.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారు నిక్షేపాల ఆనవాళ్లను గుర్తించారు. కృష్ణా నది ప్రవహించే ప్రాంతాలలో బంగారు నిక్షేపాలు ప్రత్యేకంగా ఎక్కువగా ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. ప్రత్యేకంగా.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో సుమారు 1984 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారం కోసం అన్వేషించింది. సేకరించిన నమూనాలలో కింబర్లైట్ ఉండే అవకాశం తక్కువగా ఉందని తేలింది. ఇది వజ్రాల ఆవిష్కరణపై కొంత వరకు నీళ్లు చల్లించదనే చెప్పాలి. అయితే.. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ ప్రాంతంలోని అటుకూరు బ్లాక్‌లో జిఎస్ఐ జరిపిన పరిశోధనలో బంగారు ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే.. ఇక్కడ బంగారాన్ని వాణిజ్యపరంగా వెలికితీయవచ్చా లేదా అని నిర్ధారించడానికి పరిశోధన జరుగుతోంది. బంగారు ఆనవాళ్లను వెలికితీయడం సాధ్యమేనా అని నిర్ధారించడానికి కూడా పరిశోధన జరుగుతోంది. అదేవిధంగా.. పూర్వపు నల్గొండ జిల్లాలోని హాలియా, పెద్దావూర వంటి ప్రాంతాలలో బంగారు ఆనవాళ్లు కనుగొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జియోఫిజిక్స్ విభాగం