అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను
Actor ProfileActor

అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను
AP7AM13 Oct 2026
అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను

భారత క్రికెట్ దిగ్గజం, ప్రపంచ కప్ విజేత కపిల్ దేవ్ తన మాజీ సహచరుడు యోగరాజ్ సింగ్‌తో ఉన్న దశాబ్దాల వివాదంపై తొలిసారిగా మౌనం వీడాడు. యోగరాజ్ తన చిన్ననాటి స్నేహితుడే అయినప్పటికీ, జీవితంలో విద్వేషపూరితంగా, చేదుగా మారిన వ్యక్తులను కలవడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశాడు. ఓ క్రీడా ఛానెల్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కపిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు."అతను నన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాడు, కానీ మీరు స్నేహితుడిగా వస్తేనే" అని యాంకర్ అడగ్గా, కపిల్ దేవ్ తనదైన శైలిలో స్పందించారు. "అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలియదు. నా వైపు నుంచి ఎలాంటి సమస్యా లేదు. నేను ఇప్పటికీ స్నేహితుడినే. కానీ, జీవితంలో చేదు అనుభవాలతో ర‌గిలిపోయే వ్యక్తులను కలవడం నాకు నచ్చదు. సంతోషంగా ఉండే వారిని కలవడానికే ఇష్టపడతాను. జీవితంలో ముందుకు సాగిపోవాలి. మీరు ర‌గిలిపోతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ప్రేమించరు" అని అన్నాడు.యోగరాజ్ సింగ్‌ను ఉద్దేశిస్తూ కపిల్ ఇంకా మాట్లాడుతూ.. "అతని కొడుకు (యువరాజ్ సింగ్) దేశం గర్వించేలా అద్భుతంగా రాణించాడు. కనీసం ఆ సంతోషంతోనైనా అతను ఆనందంగా జీవించాలి. జీవితంలో ఎవరికీ అన్నీ దొరకవు. కొన్నిసార్లు మీకు దక్కుతాయి, కొన్నిసార్లు మీ కుటుంబానికి దక్కుతాయి. చివరికి మీరు సంతోషంగా ఉండాలి కానీ చేదుగా కాదు. విద్వేషపూరితమైన వ్యక్తికి ఈ ప్రపంచంలో స్థానం ఉండదు" అని హితవు పలికాడు. ప్రపంచంలో ఎన్నో చూసిన వ్యక్తి, భారత్‌కు ఆడి, సినిమాల్లో కూడా నటించిన వ్యక్తి ఇంకా అసంతృప్తితో ఉండటం సరికాదని అభిప్రాయపడ్డాడు.గత వివాదం ఇదే..ఒకే