
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాతలలో నాగవంశీ ఒకరు. చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా, భారీ సినిమా ఇలా తేడా లేకుండా నాగవంశీ సితార సంస్థ నుంచి క్రేజీ చిత్రాలు వస్తున్నాయి. ఆగష్టు 14న నాగవంశీ నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం రిలీజ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అగ్ర హీరో సూర్య నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో నాగవంశీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. తన బాబాయ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు (రాధాకృష్ణ) సహకారంతో సహకారంతో నాగవంశీ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. హారిక అండ్ హాసిని సంస్థ సినిమాలలో కూడా నాగవంశీ ఇన్వాల్వ్ అవుతుంటారు. నాగవంశీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాతవాసి మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ పరంగా పర్వాలేదు అనిపించింది. నాగవంశీ మాట్లాడుతూ.. అజ్ఞాతవాసి మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా నిరాశపరిచింది. అది వాస్తవమే. కానీ గుంటూరు కారం అలా కాదు. కొన్ని ఏరియాలో చాలా బాగా వర్కౌట్ అయింది. నైజాం, ఓవర్సీస్ లో సరిగ్గా ఆడలేదు. కానీ గుంటూరు కారం చిత్రానికి ఎక్కువగా నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి సినిమా కంటెంట్ కంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎక్కువ కారణం అయ్యాయి. అదే సినిమాని డ్యామేజ్ చేసింది. అదే సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు హనుమాన్ కూడా రిలీజ్ అయింది. అందరూ ఈ రెండు చిత్రాలని కంపేర్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో థియేటర్ల గొడవ ఎక్కువ జరిగింది. ఈ అంశాల వల్లే గుంటూరు కారం చిత్రానికి డ్యామేజ్ జరిగింది అని నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం, హనుమాన్ రెండు చిత్రాలు 2024