అగధ విడుదల తేదీ ఖరారు
Actor ProfileActor

అగధ విడుదల తేదీ ఖరారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అగధ విడుదల తేదీ ఖరారు
Chitrajyothy15 Oct 2026
అగధ విడుదల తేదీ ఖరారు

ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన 'అగధ' చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఇందులో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు, దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న భారీ స్థాయిలో విడుదల కానుంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ మధ్య విడుదలైన ‘అగధ’ టీజర్ ఆడియెన్స్ లో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ వాతావరణం, గ్రాండియర్ మేకింగ్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. దీనిని 14 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ‘అగధ’ గురించి దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, 'ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. టీజర్‌లో చూసింది ఈ సినిమా ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే. సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇది ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్ వండర్‌లా అనిపించే సినిమా. అలాగే ఎమోషన్స్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పనిచేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. ప్రేక్షకులు థియేటర్లలో ఒక కొత్త అనుభూతిని పొందుతారు. మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఓ ఎమోషనల్ రోలర్ కోస్ట్ రైడ్ లా రూపొందిన ‘అగధ’ చిత్రం ఆగస్ట్ 14, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది” అని తెలిపారు. నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాం. టీజర్‌కు వచ్చిన స్పందన