అగధ' రివ్యూ
Actor ProfileActor

అగధ' రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అగధ' రివ్యూ
Samayam Telugu18 Dec 2026
అగధ' రివ్యూ

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘ అగధ ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. మరి ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం. కథ మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఎప్పుడూ కూడా దేవీ ఆరాధనలో ఉంటుంది. చుట్టూ ఉండే వారి సమస్యల్ని తీరుస్తూ, ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. అలాంటి మహాదేవి తన కుటుంబానికి కష్టం రావడంతో సొంతూరికి వస్తుంది. మహిమ (ఉల్కా గుప్తా) ఆత్మహత్య చేసుకోవడం, ఆమె గర్భంలోని బిడ్డ కూడా చావడం మహాదేవిని ఆలోచనల్లో పడేస్తుంది. ఈ ఇంటికి ఏదో కీడు జరుగుతోందని మహాదేవి గ్రహిస్తుంది. అదే క్రమంలో తన బాబాయ్(భాను చందర్), పిన్ని సుశీల (వనితా విజయ్ కుమార్) కూతురు హరిణి (జోవికా విజయ్ కుమార్) వింత ప్రవర్తన మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. మహిమ ఆత్మ ఘోషను మహాదేవి వింటుంది. మహిమ ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి)లోనూ వింత ప్రవర్తను మహాదేవి కనిపెడుతుంది. అసలు ఈ వీరంతా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంటారు?, మహిమ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది?, ఈ అగధ ఎవరు?, అగధను చేరుకునేందుకు మహాదేవి గురువు బాబా (షిజు) చేసిన త్యాగం ఏంటి? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే. దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. దుష్టశక్తి ఎంత చెలరేగినా సరే చివరకు దైవం చేతిలో ఓడిపోవాల్సిందే. మన సినిమాల్లో ఎండింగ్ అలానే ఉంటుంది. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే