అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది
Actor ProfileActor

అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది
123Telugu17 Nov 2026
అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది

ప్రముఖ నర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో శ్రవణ్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చిత్ర విశేషాలను వెల్లడించారు. ‘డర్టీ హరి’ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ‘డర్టీ హరి’ ఓటీటీ విజయం తర్వాత కరోనా వల్ల నా ప్రాజెక్ట్‌లు ఆలస్యమయ్యాయి. ‘మంగళవారం’ కోసం ఏడాది కేటాయించగా, మళ్లీ ఎంఎస్ రాజు గారు ఈ ‘అగధ’ అవకాశం ఇచ్చారు. ‘అగధ’లో మీ పాత్ర తీరు గురించి చెప్పండి? ‘డర్టీ హరి’కి పూర్తి విరుద్ధంగా, అనేక షేడ్స్ ఉన్న ‘అగధ’ పాత్ర చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎంఎస్ రాజు గారు కొత్త హుక్ పాయింట్‌తో తెరకెక్కించిన ఈ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌లో అద్భుతమైన హారర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఎం.ఎస్. రాజు గారితో మీ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి? ‘డర్టీ హరి’, ‘అగధ’ సినిమాల్లో ఎంఎస్ రాజు గారి కథలు, నా పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. సినిమా పట్ల ఆయనకున్న తాపత్రయం, డెడికేషన్ ముచ్చటేస్తాయి. ‘అగధ’లో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఉంటుంది? ‘అగధ’ చిత్రాన్ని ఎక్కువ భాగం నేచురల్ లొకేషన్స్‌లోనే తెరకెక్కించగా, మిస్టిక్ హారర్ ఫీల్ కోసం కొన్ని సెట్స్ వేశారు. ఇందులో వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ చాలా నీట్‌గా, ఆకట్టుకునేలా ఉంటుంది. ‘అగధ’కి సీక్వెల్ గానీ ప్రీక్వెల్ గానీ ఉంటుందా? ఇలాంటి సినిమాలకు పార్ట్-2 చేసే వెసులుబాటు ఉంటుంది. కథను పొడిగించే అవకాశమున్నా.. ఎంఎస్ రాజు గారు రెండో భాగం ఎప్పుడు ప్లాన్ చేస్తారో చూడాలి