
‘అగధ’ కోసం బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను – కామాక్షి భాస్కర్ల శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం ఆనందంగా అనిపించింది –


‘అగధ’ కోసం బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను – కామాక్షి భాస్కర్ల శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం ఆనందంగా అనిపించింది –

కామాక్షి భాస్కర్ల ((Kamakshi Bhaskarla) నటించిన ‘అగధ’ (Agadha) ఆగస్ట్ 14న థియేటర్లలోకి రాబోతోంది. ఎం.ఎస్.రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురించి కామాక్షి భాస్కర్ల చెప్పిన విశేషాలేంటో చూద్దాం. ‘అగధ’ గురించి చెప్పండి? ఎం ఎస్ రాజు గారు మిమ్మల్ని నటించమని ఎప్పుడు అడిగారు? నాకు ఎం.ఎస్. రాజు గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన వాటిల్లో ‘మనసంతా నువ్వే’ నాకు ఆల్ టైం ఫేవరేట్. ఆయన ‘అగధ’ కోసం ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా అనిపించింది. నా ‘పొలిమేర’ చూశానని ఆయన అన్నారు. ఆయన ప్రతీ సినిమాలోని ప్రతీ ఆర్టిస్ట్ పవర్ ఫుల్‌గానే కనిపిస్తారు. రాజు గారు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. పైగా రాజు గారు కావడంతో నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది. ఈ పాత్ర కోసం ఎలా కష్టపడ్డారు? ఈ సినిమాలో మీరు కట్టుకున్న చీర పద్దతి గురించి ఇబ్బంది పడ్డారా? మహాదేవి పాత్ర కోసం మారేందుకు నాకు టైం పట్టింది. కామాక్షిగా నన్ను నేను పక్కనపెట్టి, నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి ఆ పాత్ర కోసం మారడానికి ఇబ్బంది అనిపించింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నాను. ‘అగధ’లో ప్రతీది కూడా రాజు విజన్ అని చెప్పుకోవచ్చు. ప్రతీది డిఫరెంట్‌గా ఉండాలని ముందే ఆయన అనుకున్నారు. అలాంటి చీరకట్టులో నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ కోసం మేం ముందుగానే వర్క్ షాప్స్ చేశాం. రిహార్సల్స్ చేశాం. అయితే సెట్‌లో చిన్న చిన్న ఇబ్బందులు