అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం
Actor ProfileActor

అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం
Chitrajyothy18 Dec 2026
అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం

తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’కి సంబంధించి నూతన కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ (సీజన్ 2) ఆడిషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’ (Bigg Boss Season 10)కి సంబంధించి నూతన కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ (సీజన్ 2) ఆడిషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో పలువురు సామాన్యులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్న ప్రముఖ సోషల్ మీడియా సంచలనం ఉప్పల్ బాలు (Uppal Balu) ఎలిమినేట్ కావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆడిషన్స్ నిర్వహించిన తీరుపై, ముఖ్యంగా జడ్జీగా ఉన్న నటుడు నవదీప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. తాను మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతో కష్టపడి పైకి వచ్చానని, అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha Season 2) ఆడిషన్స్‌లో గ్రూప్ డిస్కషన్, ఎగ్జామ్స్ లాంటి అన్ని రౌండ్లు దాటుకుని ఫైనల్‌కు చేరుకున్నానని బాలు తెలిపారు. కానీ చివరి నిమిషంలో తనకు ఎటువంటి గేమ్ లేదా టాస్క్ ఇవ్వకుండా ‘నీ వీడియోలు వల్గర్‌గా ఉంటాయి.. అవి దేనికి పనికొస్తాయి?’ అని అడిగి నవదీప్ (Navdeep) అవమానించారని ఆరోపించారు. ‘‘నవదీప్.. మా వీడియోలు పనికిరావని అంటున్నారు కదా, మరి మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఎవరికైనా ఉచితంగా దానధర్మాలు చేశారా? లేదా ఎవరికైనా సహాయం చేశారా?’’ అంటూ బాలు ఘాటుగా ప్రశ్నించారు. అగ్నిపరీక్షకు పిలిచి తనలాంటి మిడిల్ క్లాస్ వారిని చిన్నచూపు చూస్తూ అవమానించడం సరైంది కాదని ఆయన అన్నారు. ‘‘మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి జడ్జ్ సీట్లో కూర్చున్నారు, అదే అవకాశం లేకపోతే మీరూ మా లాంటి వారే కదా..’’ అని ఉప్పల్ బాలు వ్యాఖ్యానించారు. నవదీప్‌ని అసలు వదిలిపెట్టనని