అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది
Actor ProfileActor

అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది
Sakshi28 Oct 2026
అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది

అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. 'లెనిన్'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తొలిరోజు కొందరి నుంచి మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ ఓవరాల్‌గా అయితే రెస్పాన్స్ బాగుంది. తొలి సక్సెస్ అందుకునేసరికి అటు అఖిల్, ఇటు భాగ్యశ్రీ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో హీరోయిన్ శ్రీలీలని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ‘లెనిన్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..?) శ్రీలీలపై చాలామంది నెటిజన్లు విమర్శలు చేయడానికి ఓ కారణం కనిపిస్తోంది. 'లెనిన్' సినిమాని ప్రకటించి ఓ వీడియో రిలీజ్ చేసినప్పుడు మొదటగా అనుకున్న హీరోయిన్ శ్రీలీలనే. అయితే తర్వాత ఈమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. సినిమాలోని ఈమె ఫెర్ఫార్మెన్స్, గ్లామర్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఒకవేళ ఇదే ప్లేసులో శ్రీలీల ఉండుంటే కచ్చితంగా ఇలా చేసేది కాదని, సినిమాకు మైనస్ అయ్యిండేదని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా శ్రీలీల.. 'లెనిన్' సినిమా చేసుంటే ఎలా ఉండేదో ఏమో గానీ సోషల్ మీడియాలో ఈమెని విమర్శించడం ఎక్కువైపోయింది. గతంలో శ్రీలీల తెలుగులో చాలా మూవీస్ చేసింది గానీ వీటిలో 'ధమాకా' తప్పితే మిగతా ఏది కూడా హిట్ కాలేదు. రొటీన్ క్యారెక్టర్స్ చేస్తుందని శ్రీలీలపై గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా 'లెనిన్' ప్రస్తావన తీసుకొచ్చి ఈమెని టార్గెట్ చేస్తున్నారు. ఈ ఏడాది రిలీజైన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల చివరగా కనిపించింది. ఇదెంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హిందీలో ఒకటి, తమిళంలో మరొకటి చేస్తోంది. అసలు తెలుగులో కొత్తగా ఏం మూవీస్ చేయనప్పటికీ ట్రోలింగ్ వల్ల మళ్లీ వార్తల్లోకి వచ్చింది. (ఇదీ చదవండి: మా వాడికి హిట్ ఇవ్వమని దేవుడిని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది) రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)