
తిరుపతిలో 'లెనిన్' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున, తన తనయుడు అఖిల్ అక్కినేని నటనపైనా, సినిమా విజయంపైనా పూర్తి ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జూలై 10న రాబోతున్న ఈ సినిమాతో 'మనవాడు కొడుతున్నాడు' అంటూ అభిమానుల్లో జోష్ నింపారు. తన ప్రసంగంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.అఖిల్ నటన గురించి నాగార్జున మాట్లాడుతూ, "ఇప్పటివరకు ఎక్కువగా అర్బన్ నేపథ్యం ఉన్న సినిమాలు చేసిన అఖిల్, ఈ సీమ మట్టి కథకు సరిపోతాడా అని మొదట కొంచెం భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నేను కాదు, మీరందరూ ఆశ్చర్యపోతారు. సినిమాలో మీకు అఖిల్ కనపడడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. ఆ పాత్రలో అఖిల్ పూర్తిగా లీనమైపోయాడు. లెనిన్ స్నేహాన్ని, ప్రేమను, పగను ప్రేక్షకులు ప్రేమిస్తారు. ఇంటికి వెళ్లేటప్పుడు లెనిన్‌ను తమతో పాటు తీసుకువెళతారు" అని అన్నారు. ఈ చిత్రాన్ని 'సీమలో జరుగుతున్న మహాభారతం'గా ఆయన అభివర్ణించారు.సినిమా కథ తనను ఎలా ఆకర్షించిందో వివరిస్తూ, "దర్శకుడు నందు మురళీ కిశోర్ అబ్బూరు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) పుట్టిన ఊరు కావడంతో నాకు వెంటనే ఒక సెంటిమెంట్ కలిగింది. ఆ ఆసక్తితో కథ విన్నాను. కథలో ఎన్నో మలుపులు, రకరకాల పాత్రలు చాలా ఆకట్టుకున్నాయి. ప్రేమకు మించిన