అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే
Actor ProfileActor

అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే
Asianet News Telugu6 Oct 2026
అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే

నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ మూవీ తొలి చిత్రంగా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన అఖిల్ తీవ్రంగా నిరాశ పరిచింది. అఖిల్ తొలి చిత్రానికి తప్ప ఆ తర్వాత నటించిన ఏ సినిమాకి భారీ అంచనాలు, బజ్ ఏర్పడలేదు. కానీ త్వరలో రిలీజ్ కాబోతున్న లెనిన్ మూవీకి మాత్రం సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. అఖిల్ ఈ చిత్రంపై చాలా పాజిటివ్ గా, ఉత్సాహంగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో లెనిన్ మూవీ హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలలో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ కి కూడా అఖిల్ సమాధానాలు ఇస్తున్నాడు. గతేడాది జూన్ లో అఖిల్, జైనబ్ ల వివాహం జరిగింది. ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. లెనిన్ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అఖిల్ భార్య జైనబ్ ప్రస్తావన వచ్చింది. మిమ్మల్ని మీ భార్య ఏమని పిలుస్తుంది అని అడగగా.. ప్రస్తుతానికి లెనిన్ అంటోంది అంటూ ఫన్నీగా అఖిల్ సమాధానం ఇచ్చారు. అలా కాదు ముద్దుగా ఏమని పిలుస్తుంది అని యాంకర్ ప్రశ్నించారు. నన్ను ఆమె 'మా' అని సింపుల్ గా పిలుస్తుంది అని అఖిల్ తెలిపారు. తన భార్యని ఏమని పిలుస్తాడో కూడా అఖిల్ రివీల్ చేశారు. తాను జైనబ్ ని బంగారం అని అంటానని అఖిల్ తెలిపారు. జైనబ్ కూడా ధనిక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. ఆమె తండ్రి బడా వ్యాపారవేత్త. ఇదిలా ఉండగా అఖిల్ లెనిన్ మూవీ జూలై 10న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సితార నాగవంశీ మరో నిర్మాత