అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి
Actor ProfileActor

అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి
Asianet News Telugu2 Oct 2026
అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అఖిల్ గతంలో పెద్దగా మాట్లాడేవాడు కాదు, అక్కినేని అభిమానులను పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ మునుపటిలా కాకుండా కాస్త స్పీడ్ పెంచాడు. ఎక్కువగా అభిమానులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. తనను తాను నిరూపించుకనే అవకాశం ఇవ్వాలని అభిమానులను అడుగుతున్నాడు. ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో ఓ సెంటిమెంట్ బలంగా వైరల్ అవుతోంది. అఖిల్ సక్సెస్ అవ్వకపోవడానికి నేమ్ సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తుందా అన్న అనుమానం వస్తోంది. అక్కినేని హీరోల అందరికి పేరుకు ముందు నాగ ఉంటుంది. కానీ అఖిల్ పేరుకి మాత్రం అది తగిలించలేదు. అందుకే ఈ యంగ్ హీరో సక్సెస్ సాధించలేకపోతున్నాడా అని అక్కినేని అభిమానులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇక ఒక వీరాభిమాని అయితే.. అఖిల్ కు కొత్త పేరు సూచిస్తూ.. ఆయన ముందే డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. తిరుపతిలో జరిగిన ఈవెంట్ లో ఆ అభిమాని మాట్లాడిన మాటలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. లెనిన్ మూవీ ఈవెంట్ లో అఖిల్, నాగార్జున ప్రసంగాలు అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, ఓ అక్కినేని అభిమాని చేసిన వినూత్న ప్రతిపాదన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన అభిమాన హీరో పేరు మార్చుకోవాలని సూచిస్తూ, దాని వెనుక ఉన్న సెంటిమెంట్‌ను వివరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెనిన్ ఈవెంట్ లో మాట్లాడిన ఆ అభిమాని, అఖిల్ తన పేరును 'నాగ అఖిల్' గా మార్చుకుంటే బాగుంటుందని సూచించాడు. ఈ పేరు వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. 'నాగ' అనే పదం అఖిల్ తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున పేర్ల నుంచి తీసుకున్నదని