అఖిల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సమంత.. బ్లాక్ బస్టర్ సినిమా అంటూ పోస్ట్
Actor ProfileActor

అఖిల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సమంత.. బ్లాక్ బస్టర్ సినిమా అంటూ పోస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖిల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సమంత.. బ్లాక్ బస్టర్ సినిమా అంటూ పోస్ట్
Eenadu20 Oct 2026
అఖిల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సమంత.. బ్లాక్ బస్టర్ సినిమా అంటూ పోస్ట్

ఇంటర్నెట్‌ డెస్క్: మూడేళ్ల విరామం తర్వాత ‘లెనిన్‌’తో పలకరించారు హీరో అఖిల్‌. ఈ నేపథ్యంలో టీమ్‌కు సమంత (Samantha) ఆల్ ది బెస్ట్‌ చెప్పారు. అఖిల్‌ హీరోగా మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెనిన్’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా (Lenin) పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో టీమ్‌ను ట్యాగ్ చేస్తూ సమంత పోస్ట్‌ పెట్టారు. ‘‘లెనిన్ చిత్రబృందానికి.. ప్రత్యేకంగా అఖిల్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌ అనే టాక్‌ వినిపిస్తోంది’’ అంటూ సినిమా ట్రైలర్‌ను పంచుకున్నారు. ఇటీవల సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సినిమా హిట్ అయిన నేపథ్యంలో అఖిల్‌ ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఆ కాన్సెప్ట్‌ తనకెంతో నచ్చిందని.. మంచి ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే అంశంతో పాటు, పవర్‌ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఒక మహిళ పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం అద్భుతమని.. సమంత తన పాత్రలో చాలా బాగా నటించారని కొనియాడారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంటర్నెట్‌ డెస్క్: వరుస సినిమాలతో అలరిస్తోన్న అందాల భామ భాగ్యశ్రీ నేడు అఖిల్‌తో కలిసి సందడి చేస్తోంది. వీరిద్దరూ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ‘లెనిన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ గురించి కొన్ని విశేషాలు చూద్దాం