అక్షయ్ కుమార్ తెలుగు సినిమా
Actor ProfileActor

అక్షయ్ కుమార్ తెలుగు సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్షయ్ కుమార్ తెలుగు సినిమా
10TV Telugu22 Dec 2026
అక్షయ్ కుమార్ తెలుగు సినిమా

Akshay Kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లీడ్‌లో రోల్‌ ఓ తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటించబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో యాక్ట్ చేయబోతున్నాడట. ఈ సెన్సేషనల్ ప్రాజెక్టుకు టాలీవుడ్ డైరెక్టర్ చందు మొండేటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథలో కీలకమైన పాత్రలో రానా కూడా కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్, రానా కాంబినేషన్‌లో సినిమా అంటేనే ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరగడం ఖాయం. గతంలో బేబీ సినిమాలో అక్షయ్‌కుమార్, రానా కలిసి నటించారు. ఆ తర్వాత ఇప్పుడు చందు మొండేటి డైరెక్షన్‌లో కీలక పాత్రల్లో యాక్ట్ చేయబోతున్నారని.. స్టెయిల్ తెలుగు సినిమా అని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. Payal Radhakrishna : Happy birthday to me అంటూ సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్‌.. ఈ భారీ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడనే టాక్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. అయితే అక్షయ్ కుమార్, రానా, చందు మొండేటి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ టాక్ నిజమైతే టాలీవుడ్‌, బాలీవుడ్ కాంబినేషన్‌లో ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఉజ్జయిని నేపథ్యంతో కూడిన 300 ఏళ్ల నాటి చారిత్రక రహస్యాల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి