
Telangana Government: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ప్రణాళికాబద్ధమైన నగర అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాల కట్టడికి అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన ‘క్యూర్ బిల్లు – 2026’ ముసాయిదాను సిద్ధం చేసింది. నగరంలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ కొత్త బిల్లులో పలు కీలక సవరణలను ప్రతిపాదించింది. Taj Mahal: తాజ్ మహల్‌లో శివాలయం? సర్వే చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం, ఏఎస్ఐలకు నోటీసులు! ఈ ముసాయిదా బిల్లులోని అత్యంత కీలకమైన ప్రతిపాదన ఏమిటంటే.. అనుమతి లేని అక్రమ నిర్మాణాలపై ఏకంగా 300 శాతం ఆస్తి పన్ను (Property Tax) విధించడం. ప్రస్తుతం అమలులో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం-1955 ప్రకారం అక్రమ నిర్మాణాలపై ఆస్తి పన్నులో 100 శాతం మాత్రమే జరిమానా విధిస్తున్నారు. అయితే, ఈ పెనాల్టీలు అక్రమ కట్టడాలను అడ్డుకోలేకపోతుండటంతో, కొత్త బిల్లు ద్వారా దానిని మూడు రెట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీ జరిమానాల భయంతోనైనా నిబంధనల ఉల్లంఘనలు తగ్గుతాయని భావిస్తోంది. మరోవైపు, నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ(Telangana Government) భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (HYDRAA)కు ఈ బిల్లు ద్వారా పూర్తి చట్టబద్ధతతో పాటు అదనపు అధికారాలను కల్పించనున్నారు. భూకబ్జాదారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారాన్ని కూడా హైడ్రాకు అప్పగించనున్నారు. అంతేకాకుండా, ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమిస్తూ, దోమలు మరియు వివిధ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే నిర్లక్ష్యపు ప్రాంగణాలను, నిర్మాణ స్థలాలను తక్షణమే మూసివేసే (సీజ్ చేసే) కఠినమైన అధికారం కూడా అధికారులకు లభించనుంది
