అక్కడ నిషేధం.. ఇక్కడ ఆహ్వానం
Actor ProfilePolitician

అక్కడ నిషేధం.. ఇక్కడ ఆహ్వానం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్కడ నిషేధం.. ఇక్కడ ఆహ్వానం
Sakshi27 Dec 2026
అక్కడ నిషేధం.. ఇక్కడ ఆహ్వానం

డేటాప్రోతో చంద్రబాబు ప్రభుత్వ ఒప్పందం(ఫైల్‌) మరో దొంగ కంపెనీకి బాబు సర్కారు రెడ్‌ కార్పెట్‌ పలు రాష్ట్రాల ప్రభుత్వాలను మోసం చేసిన డేటా ప్రో 2021లో ఈ కంపెనీపై జమ్మూ అండ్‌ కశ్మీర్‌లో ఏసీబీ కేసు నమోదు తప్పుడు బిల్లులతో క్లెయిమ్‌లకు దరఖాస్తు చేసిన వైనం దీంతో ఆ కంపెనీని బ్యాన్‌ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే కంపెనీతో చంద్రబాబు సర్కారు ఒప్పందం సాక్షి, అమరావతి: దొంగ బిల్లులతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండికొట్టే కంపెనీలకు చంద్రబాబు సర్కారు రెడ్‌ కార్పెట్‌ వేసి మరీ పిలుస్తోంది. రాష్ట్రంలో హరిత ఇంధన రంగంలో రూ.76,250 కోట్ల పెట్టుబడి పెడతానంటూ ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన ఎకోరన్‌ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్‌ ఏకంగా దొంగ ఇన్‌వాయిస్‌లతో రూ.64 కోట్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన ఘటన మరవకముందే..ఇప్పుడు బాబు సర్కారు మరో దొంగ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికంటూ సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖకు చెందిన డేటా ప్రో కంప్యూటర్స్‌ లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నైపుణ్య శిక్షణ పేరిట ఈ కంపెనీ పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తూ దొంగ బిల్లులతో అడ్డంగా దొరికిపోవడమే కాకుండా కొన్నిరాష్ట్రాలు ఈ కంపెనీపై ఏకంగా నిషేధాన్ని కూడా విధించాయి. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన కంపెనీతో చంద్రబాబు స్వయంగా ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు అధికారవర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. జమ్మూ అండ్‌ కశ్మీర్‌లో ఏసీబీ కేసు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు చూపించడమే కాకుండా వారికి ఉపాధి కల్పించినట్లు దొంగ సర్టిఫికెట్లు సమర్పించి రూ.కోట్లు కొట్టేయడానికి పథకం వేసి విశాఖకు చెందిన డేటాప్రో కంప్యూటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయింది. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కు చెందిన ‘హిమాయత్‌ ప్రోగ్రామ్‌’ను అమలు