అందుకే సావిత్రమ్మకు మహానటి’ అని బిరుదు ఇచ్చారు
Actor ProfileActor

అందుకే సావిత్రమ్మకు మహానటి’ అని బిరుదు ఇచ్చారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందుకే సావిత్రమ్మకు మహానటి’ అని బిరుదు ఇచ్చారు
Sakshi25 Oct 2026
అందుకే సావిత్రమ్మకు మహానటి’ అని బిరుదు ఇచ్చారు

దివంగత మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్‌ కిషోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ ఇంగ్లిష్‌ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటీనటులు జయప్రద, బ్రహ్మానందం, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత నాగ సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, ఆమె భర్త గోవిందరావు, వర ప్రసాద్‌ రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ పుస్తకం రిలీజ్‌ చేయడం నా అదృష్టం. చాముండేశ్వరిగారిని చూస్తే నాకు సావిత్రమ్మగారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి వారికి ధీటుగా నటించినందుకే సావిత్రమ్మకు మహానటి బిరుదు ఇచ్చారు’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘సావిత్రిగారు చిరస్మరణీయులు. అలాంటి వారికి మరణం ఉండదు’’ అని అన్నారు. విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ– ‘‘సావిత్రి క్లాసిక్స్‌’ తెలుగు బుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఇంగ్లిష్‌లో అనువదిస్తే మరింత మందికి రీచ్‌ అవుతుందని రిలీజ్‌ చేశాం’’ అని పేర్కొన్నారు. ‘‘నా పట్టుదల, ప్యాషన్‌ చూసి సావిత్రిగారి అరుదైన ఫొటోలను చాముండేశ్వరిగారు ఇచ్చారు’’ అన్నారు పుస్తక రచయిత సంజయ్‌ కిషోర్‌. భీమవరంలో సినీనటి కృతిశెట్టి సందడి (ఫొటోలు) బోనీ కపూర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సినీ తారల సందడి (ఫోటోలు) యూకే అంబాసిడర్‌తో పూనమ్ కౌర్ సందడి (ఫోటోలు) సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) చేతులెత్తి మొక్కుతున్నాం... మమ్మల్ని చంపేసి షాపులు తీయండి..! ఫస్ట్ పవన్ పై కేసు పెట్టాలి.. రావణ్ UAPA కేసుపై CPI నారాయణ షాకింగ్ కామెంట్స్ మూకాంబిక ఆలయంలో వేల కోట్ల నిధి! సర్వముద్ర వెనుక రహస్యం? దారుణ హత్యలు.. వాడిని వదిలిపెట్టం చంపేస్తాం..!