అందుకే మా అండాల్ని భద్రపరచుకున్నాం
Actor ProfilePolitician

అందుకే మా అండాల్ని భద్రపరచుకున్నాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అందుకే మా అండాల్ని భద్రపరచుకున్నాం
Eenadu6 Oct 2026
అందుకే మా అండాల్ని భద్రపరచుకున్నాం

‘అప్పుడే పెళ్లికి తొందరేముంది?’ అంటోంది నవతరం. ఒకవేళ పెళ్లయినా.. ‘అప్పుడే పిల్లలు వద్దు..’ అంటూ సంతానాన్ని వాయిదా వేస్తున్నాయి కొన్ని జంటలు. అయినా ముందుచూపుతో ఆలోచించి.. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనిచ్చేందుకు ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ పద్ధతిని పాటిస్తున్నారు కొందరు మహిళలు. ‘అప్పుడే పెళ్లికి తొందరేముంది?’ అంటోంది నవతరం. ఒకవేళ పెళ్లయినా.. ‘అప్పుడే పిల్లలు వద్దు..’ అంటూ సంతానాన్ని వాయిదా వేస్తున్నాయి కొన్ని జంటలు. అయినా ముందుచూపుతో ఆలోచించి.. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనిచ్చేందుకు ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ పద్ధతిని పాటిస్తున్నారు కొందరు మహిళలు. వీరిలో సెలబ్రిటీలూ ఉన్నారు. తానూ ఇందుకు మినహాయింపు కాదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కృతీ సనన్. ‘మిమి’ సినిమా చిత్రీకరణ సమయంలోనే తన అండాల్ని భద్రపరచుకున్నట్లు ఇటీవలే ఓ సందర్భంలో బయటపెట్టిందీ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో గతంలో ఎగ్‌ఫ్రీజింగ్‌ పద్ధతిని పాటించిన పలువురు సెలబ్రిటీలు, వాళ్ల అనుభవాల గురించి తెలుసుకుందాం.. మహిళల వయసు పెరిగే కొద్దీ అండాల నిల్వ-నాణ్యత తగ్గిపోతాయి. ఇలాంటి అండాల్లో క్రోమోజోమ్‌ సంబంధిత అసాధారణతలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో పుట్టబోయే పిల్లల్లో అవకరాలు, ఇతర శారీరక/మానసిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగని అప్పటికప్పుడు పిల్లల్ని కనడానికి కొంతమంది సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. వయసులో ఉన్నప్పుడే నాణ్యమైన అండాల్ని సేకరించి వాటిని శీతలీకరించడమే దీని ముఖ్యోద్దేశం. ఆపై కాస్త ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకున్నా మహిళలు తాము దాచుకున్న ఈ ఆరోగ్యకరమైన అండాల్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చు. కొంతమంది వయసు మీరుతోందని తమకు ఇష్టం లేకపోయినా ఇతరుల ఒత్తిడితో పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం.. వంటివి చేస్తుంటారు. కానీ శారీరకంగా, మానసికంగా పూర్తిగా సిద్ధపడినప్పుడే ఈ రెండు విషయాల్లో ముందడుగు వేయాలంటోంది కృతి. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్‌ ఫ్రీజింగ్‌ ఓ వరమని చెబుతోంది. ‘ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి.. అప్పుడే పిల్లల్ని కనాలి.. అన్న నియమాలకు నేను