అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు
Actor ProfilePolitician

అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు
Zee Telugu21 Nov 2026
అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lal Darwaza Temple: ఆషాఢమాసంలో హైదరాబాద్‌లో జగన్మాత స్మరణలో మునిగింది. గల్లీ గల్లీ.. వాడా వాడ అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక హైదరాబాద్‌ మొత్తం కోలాహలంగా మారింది. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటాలు, భక్తుల సందడి కనిపిస్తోంది. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. తెలంగాణవాసుల ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమై బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు సహా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి' అని వివరించారు. 'వందల సంవత్సరాలుగా హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి..గతంలో నిజాం రాజు హయాంలో కూడా వేడుకలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండాలని