
Hushar Pittalu Review: అన్ష్, వాసవి గణేషన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్ పై వెంకట్ యాదవ్ నిర్మాణంలో బిక్షు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ సినిమాని ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నా మూడు రోజుల ముందు నుంచే పలు నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. రవి(అన్ష్) అప్పుడే టెన్త్ క్లాస్ అయిపోతుంది. స్కూల్ ఫస్ట్ వస్తాడు. అదే ఊళ్ళో ఉండే చిట్టి(వాసవి గణేశన్) అప్పుడే పెద్దమనిషి అవుతుంది. చిట్టి రవిని చూసి ఇష్టపడుతుంది. చక్కగా చదువుకునే రవిని బాలన్న, ఇంకొంతమంది కలిసి అడల్ట్ వీడియోలు చూపించి, అమ్మాయిలను ప్రేమించాలి అని చెప్పి చెడగొడతారు. దాంతో రవి కూడా చిట్టికి కనెక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరూ తెలిసి తెలియని వయసులో హద్దులు దాటి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏకంగా శృంగారం చేసుకునే దాకా వెళ్తారు. ఇది చిట్టి అక్క శైలు(ప్రణీ రెడ్డి)కి తెలిసి హెచ్చరించినా వినకుండా కుదిరినప్పుడల్లా అదే ప్రేమ అనుకోని శృంగారం చేసుకుంటారు. చిట్టిని ఎంతో ప్రేమగా చూసుకునే ఆమె తండ్రి(గోవర్ధన్)కి ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడు? రవి తండ్రికి ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు? తెలిసి తెలియని వయసులో చేసిన శృంగారంతో వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళ ప్రేమ ఫలిస్తుందా లేదా? ఈ సంఘటనలతో వీళ్ళ జీవితం ఎలా మారుతుంది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే. హుషార్ పిట్టలు అనే టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉన్న అడల్ట్ కంటెంట్ కి టీజర్ ఒక్కసారిగా వైరల్ అయి సినిమాపై అంచనాలు పెంచడమే కాక ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ట్రైలర్ తర్వాత ఇది ఎలాంటి సినిమానో కాస్త క్లారిటీ వచ్చింది. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ కూడా బాగుండటం, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా రిలీజ్