హీరో సుశాంత్ సింగ్ కేసుతో దేశవ్యాప్తంగా గుర్తింపు.. ఐపీఎస్ నుపుర్ ప్రసాద్ కు రాష్ట్రపతి పతకం
Actor ProfileActor

హీరో సుశాంత్ సింగ్ కేసుతో దేశవ్యాప్తంగా గుర్తింపు.. ఐపీఎస్ నుపుర్ ప్రసాద్ కు రాష్ట్రపతి పతకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరో సుశాంత్ సింగ్ కేసుతో దేశవ్యాప్తంగా గుర్తింపు.. ఐపీఎస్ నుపుర్ ప్రసాద్ కు రాష్ట్రపతి పతకం
AP7AM22 Dec 2026
హీరో సుశాంత్ సింగ్ కేసుతో దేశవ్యాప్తంగా గుర్తింపు.. ఐపీఎస్ నుపుర్ ప్రసాద్ కు రాష్ట్రపతి పతకం

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారి నుపుర్‌ ప్రసాద్‌కు ప్రతిష్ఠాత్మక పోలీస్‌ మెడల్‌ లభించింది. 2007 బ్యాచ్‌కు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్‌ అధికారిణి నుపుర్‌ ప్రసాద్‌కు ఈ ఏడాది ‘మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌’ పురస్కారం దక్కింది. క్లిష్టమైన కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణ, ప్రజాసేవ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆమె అందించిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ పోలీస్‌ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) జాయింట్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తుతో నుపుర్‌ ప్రసాద్‌ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2020 జూన్‌ 14న ముంబయిలోని నివాసంలో సుశాంత్‌ మృతిచెందిన ఘటనపై ఆయన కుటుంబం ఫిర్యాదు చేయడంతో కేసు సీబీఐకి చేరింది. 2020 ఆగస్టులో దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్‌ ఆధారాలు, వైద్య నివేదికలు సహా పలు అంశాలను పరిశీలించిన దర్యాప్తు బృందాన్ని నుపుర్‌ ప్రసాద్‌ పర్యవేక్షించారు.ఈ కేసులో 2025లో సీబీఐ తుది నివేదికను సమర్పించింది. దర్యాప్తులో హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా నేరపూరిత కుట్రకు ఆధారాలు లభించలేదని పేర్కొంటూ కేసును మూసివేయాలని సిఫార్సు చేసింది. ఈ కేసుతో పాటు పలు కీలక దర్యాప్తుల్లోనూ నుపుర్‌ ప్రసాద్‌ పనిచేశారు. వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కేసు, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ ఒప్పందం కేసు వంటి ప్రముఖ దర్యాప్తుల్లోనూ ఆమె కీలకంగా వ్యవహరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.సీబీఐకి వెళ్లక ముందు నుపుర్‌ ప్రసాద్‌ ఢిల్లీ

హ ర స శ త స గ క స త ద శవ య ప త గ గ ర త ప ఐప ఎస న ప ర ప రస ద క ర ష ట రపత పతక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in