హీరోలు చెబితే వావ్ అంటారు.. హీరోయిన్ అయితే లెక్కే ఉండదు
Actor ProfileActor

హీరోలు చెబితే వావ్ అంటారు.. హీరోయిన్ అయితే లెక్కే ఉండదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరోలు చెబితే వావ్ అంటారు.. హీరోయిన్ అయితే లెక్కే ఉండదు
Chitrajyothy26 Sept 2026
హీరోలు చెబితే వావ్ అంటారు.. హీరోయిన్ అయితే లెక్కే ఉండదు

చిత్ర పరిశ్రమలో హీరోలకో న్యాయం.. హీరోయిన్లకో రూలా అంటూ మండిపడ్డారు జాతీయ పుర్కసార గ్రహీత కథానాయిక కృతీసనన్‌ చిత్ర పరిశ్రమలో హీరోలకో న్యాయం.. హీరోయిన్లకో రూలా అంటూ మండిపడ్డారు జాతీయ పుర్కసార గ్రహీత కథానాయిక కృతీసనన్‌(Krithisanon). సెట్స్‌లో హీరోయిన్ల పని, టైమింగ్‌ విషయంలో ఇండస్ట్రీ తీరు ఎలా ఉంటుందో ఆమె వివరించారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం లేపాయి. సెట్స్‌పై ఉండే మేనేజ్‌మెంట్‌కు హీరోల టైమింగ్స్‌ అంటే ఒక రకమైన భయం, గౌరవం ఉంటాయి. కానీ హీరోయిన్ల విషయంలో అలా ఉండదు. ద్వంద్వ వైఖరి చూపిస్తారు. ఫీమేల్‌ ఆర్టిస్ట్‌లను లైట్‌గా చూస్తారు. హీరోలు కారావ్యాన్‌లో ఉండి సిద్ధం కాకపోయినా అసిస్టెంట్‌ డైరెక్టర్లు హీరోయిన్లను ముందే సెట్‌లో కూర్చోబెడతారు. మహిళా నటుల సమయాన్ని తీసి పారేస్తారు. ఇక్కడ ఉండాల్సింది లగ్జరీ లైఫ్‌ కాదు. తోటి నటీనటులుగా దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం ముఖ్యం. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇలా చాలా విషయాల్లో ఎంతో మార్పు రావలసిన అవసరం ఉంది. ఎవరైనా నటీమణి ఒక సన్నివేశంలో ఇలాంటి మార్పు చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఇండస్ర్టీ చూసే కోణమే మారిపోతుంది. నాకు మొదటి నుంచి సినిమాల మేకింగ్‌ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. ఒక సీన్‌ను ఇలా చేస్తే బాగుంటుందని గతంలో ఒక దర్శకుడికి సలహా ఇవ్వబోయాను. అంతే సదరు దర్శకుడు కోపానికి గురయ్యడు. ‘మరీ అంత లోతుగా ఆలోచించకు, చెప్పింది చెయ్‌’ అంటూ నా మాటను కొట్టిపారేశాడు. ఆ సమయంలో నా మనసు ఎంతో గాయపడింది. ఒక నటి ప్రశ్నలు అడిగితే ‘అబ్బో మళ్లీ మొదలుపెట్టింది, ఎన్ని ప్రశ్నలు అడుగుతుంది’ అని కామెంట్స్‌ చేస్తారు. అదే సన్నివేశం గురించి పక్కనే ఉన్న ఒక హీరో అడిగినా, సలహా ఇచ్చినా సెట్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది. హీరోలు చెప్పిన మాటలకు ‘వావ్‌’ అంటారు. ‘ఆయన సినిమాపై ఎంత శ్రద్థ చూపిస్తున్నారు, కథలో