హీరోలకు షాక్ ఇస్తున్న అందాల భామలు
Actor ProfileActor

హీరోలకు షాక్ ఇస్తున్న అందాల భామలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరోలకు షాక్ ఇస్తున్న అందాల భామలు
TV9 Telugu10 Dec 2026
హీరోలకు షాక్ ఇస్తున్న అందాల భామలు

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ సాంగ్స్‌కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నేటితరం నటీమణులు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, యాక్షన్, మాస్ పెర్ఫార్మెన్స్‌లతో పాటు విలనిజంలోనూ దుమ్ము రేపుతూ, ఏకంగా హీరోలనే డామినేట్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్‌లో సంచలనం సృష్టించిన అనేక చిత్రాల్లోనూ ఈ హీరోయిన్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.దీనికి ఒక ఉదాహరణ వామికా గబ్బి. సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామికా, తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీ, పంజాబీ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు, వెబ్ సిరీస్‌లలోనూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ సినిమాతో వామికా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రంలో చంద్ర అనే శక్తివంతమైన పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో లోకేష్ కనగరాజ్‌ను కూడా వామికా డామినేట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే.. అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?