
సాధారణంగా పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు తల్లిదండ్రులు తీసుకుంటారు. కానీ హీరోయిన్ మమిత బైజు (Mamitha Baiju) జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాల్ని మాత్రం ఆమె అన్నయ్య తీసుకుంటాడట. ఈ విషయాన్ని మమితానే ప్రకటించింది. కేరళలోని కొట్టాయంలో జన్మించింది మమిత. ఆమె తండ్రి డాక్టర్. డిగ్రీలో సైకాలజీ పూర్తిచేసిన మమితకు చిన్నప్పట్నుంచి అన్నయ్య అంటే ఇష్టం. అతడు స్టేట్ లెవెల్ క్రికెటర్. చిన్నప్పట్నుంచి హీరోయిన్ గా ఎదిగినంతవరకు అన్నయ్యతోనే ఎక్కువగా గడిపింది మమిత. తను నటిగా మారడానికి, ఎదగడానికి అన్నయ్య ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పుకొచ్చింది. అందుకే తన జీవితంలో తీసుకుబోయే కీలక నిర్ణయాల్ని అన్నయ్య చేతిలో పెట్టింది. చివరికి తన పెళ్లి విషయంలో కూడా అన్నయ్యే తుది నిర్ణయం తీసుకుంటాడని చెబుతోంది. అంతేకాదు, తనకు ఏవైనా లవ్ ప్రపోజల్స్ వస్తే వాటిని కూడా తన అన్నయ్యే డీల్ చేస్తాడని కూడా చెబుతోంది మమిత. చివరికి మమితకు వచ్చే ఫోన్ మెసేజీలు, సోషల్ మీడియా కామెంట్లు కూడా ఆమె అన్నయ్యే చూస్తాడంట