టాలీవుడ్ డైరెక్టర్ జి. అశోక్ బాబు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. హీరోగా పరిచయం చేయకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)లో కేసు నమోదు చేశారు.తన కుమారుడిని సినిమాలో హీరోగా పరిచయం చేస్తానని దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు హామీ ఇచ్చారని.. పలు దఫాలుగా రూ.3.5 కోట్లు తీసుకున్నారని హనుమంతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం తన కొడుకుతో సినిమా తీయకపోగా.. తీసుకున్న డబ్బులు కూడా తిరిగి వెనక్కి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అశోక్ బాబుతో పాటుగా నిర్మాత విజయలక్ష్మి పేరుని కూడా కంప్లెయింట్ లో చేర్చారు. హనుమంతరావు ఫిర్యాదు స్వీకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మిని విచారణకు ఆదేశించారు.* ధనుష్ - వెట్రి మారన్ కాంబోలో ‘మురుగన్’.. ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కి పోటీగా ప్రకటన 'ఆకాశ రామన్న' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అశోక్ బాబు.. నానితో 'పిల్ల జమిందార్' సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆది సాయికుమార్ తో 'సుకుమారుడు'.. అంజలి ప్రధాన పాత్రలో 'చిత్రాంగధ' సినిమాలు తెరకెక్కించారు. ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అనుష్క శెట్టితో తీసిన 'భాగమతి' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఇదే చిత్రాన్ని 'దుర్గావతి' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. 'కుచ్ ఖట్టా హో జాయ్', 'ఉఫ్ యే సియాపా' వంటి మరో రెండు సినిమాలను రూపొందించారు. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని, అలాంటి ఒక సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు ఇలా మోసానికి పాల్పడటం హాట్
Actor ProfileActor
హీరోగా ఛాన్స్ ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. పిల్ల జమిందార్’ డైరెక్టర్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•26 Oct 2026
హీరోగా ఛాన్స్ ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. పిల్ల జమిందార్’ డైరెక్టర్ పై కేసు నమోదు