
జబర్దస్త్ అప్పారావు ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ జీవిత ప్రయాణం, సినీ రంగంలో ఎదురైన అనుభవాలను, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్‌తో తన అనుబంధాన్ని వివరించారు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసినా, చాలామందితో సంభాషణలు సాధ్యపడవని, రావు రమేష్ గారు, మహేష్ బాబు వంటి కొందరు మాత్రమే షాట్‌కి ముందు, తర్వాత కొద్దిసేపు మాట్లాడేవారని అప్పారావు వెల్లడించారు. రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రంలో ఒక పాటలో తన భుజంపై చెయ్యేసి కొద్దిసేపు రామ్ చరణ్ మాట్లాడారని, అయితే ఆ సినిమాలో తన పాత్ర చివరికి తొలగించబడిందని తెలిపారు. ఆ పాత్రను మొదట రాజ్ కిరణ్ గారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారు పోషించారని చెప్పారు. తనకు జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపు, ఫేమ్ గురించి ప్రస్తావిస్తూ, తాను ఎప్పుడూ సెలబ్రిటీగా భావించుకోలేదని, బేసిక్‌గా తాను స్టేజ్ ఆర్టిస్టునేనని అప్పారావు అన్నారు. ప్రభాస్ గారు హీరో అవ్వకముందే తమ గురువు సత్యానందం గారి వద్ద యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఆయనతో కలిసి ఇంప్రవైజేషన్స్ చేశానని గుర్తుచేసుకున్నారు. చక్రం సినిమాకు ప్రభాస్ గారికి కోచింగ్ ఇస్తున్నప్పుడు తాను గురువు గారికి అసిస్టెంట్ గా పనిచేశానని తెలిపారు. ప్రభాస్ హీరో అయిన తర్వాత బిళ్లా సమయంలో ఒకసారి, రాధేశ్యామ్ ట్రిమ్మింగ్ వర్క్ సమయంలో ఒకసారి మాత్రమే కలిశానని అప్పారావు చెప్పారు. రెండోసారి కలిసినప్పుడు, ప్రభాస్ ఆయన్ను చూడగానే సోఫాలో నుంచి లేచి నిలబడి, కౌగిలించుకొని కూర్చోమని చెప్పి, టీ కాఫీలు తెప్పించి, కుటుంబ యోగక్షేమాలు అడిగారని, తమ గురువు సత్యానందం గారికి ఎంత గౌరవం ఇస్తారో తనకూ అంతే గౌరవం ఇచ్చారని అప్పారావు భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలోని కష్టాలను పంచుకుంటూ, 1982 నుండి 2000 వరకు ఒక ఆటోమొబైల్ షాప్‌లో పనిచేశానని, నెలకు 90 రూపాయల జీతంతో ప్రారంభించి, చివరికి 2775 రూపాయల జీతంతో మానేశానని తెలిపారు. 2000 సంవత్సరంలో సినిమా అవకాశం