
జీవీ ప్రకాష్ కుమార్ నటించిన ‘హ్యాపీరాజ్’ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన ‘మురట్టుకాలై’ పాటను అనుమతి లేకుండా వినియోగించారంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) నటించిన ‘హ్యాపీరాజ్’ (Happy Raj) చిత్రంలో ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా (Ilaiyaraaja) పాటలను వాడకంపై మద్రాస్ హైకోర్టు స్టే (Madras High Court) విధించింది. మార్చి 27 న విడుదలైన ఈ చిత్రంలో శ్రీ గౌరిప్రియ, ప్రార్థనా, అబ్బాస్, మరియం జార్జ్ తదితరులు నటించగా రాజా ఇళంజెళియన్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. అయితే, ఈ చిత్రంలో ఇళయరాజా సంగీతం సమకూర్చిన ‘మురట్టుకాలై’ చిత్రంలోని పాటను వినియోగించారు. ఈ పాటను తన అనుమతి లేకుండా ఉపయోగించారని, అందువల్ల సినిమా నుంచి తొలగించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఇళయరాజా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగగా, ‘హ్యాపీరాజ్’ పాటను ఉపయోగించకుండా స్టే విధిస్తూ, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని దర్శకుడు, నిర్మాతలను ఆదేశించింది