
ఆంధ్రప్రదేశ్ లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయండి విశాఖలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ/ఇంజనీరింగ్ విభాగానికి ప్రతిపాదన హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ మాట్లాడుతూ… భారత్ లోని చెన్నై, అనంతపురంలో మాడ్యూల్స్, కీలక విడిభాగాలను తమ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. గురుగ్రామ్ ఆఫ్టర్‌మార్కెట్ విడిభాగాల కేంద్రంగా ఉంది, చెన్నై లాజిస్టిక్స్ కేంద్రం నుంచి హ్యుందాయ్/కియా సర్వీస్ విడిభాగాలను ఎగుమతి చేస్తుందని చెప్పారు. కొత్తగా హైదరాబాద్ లో ఆర్ & డీ కేంద్రం, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఆర్ & డీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతపురంలోని తయారీ కేంద్రం ద్వారా హ్యుందాయ్ సంస్థ కియా ఇండియా కోసం మాడ్యూల్స్, కీలక విడిభాగాలను ఉత్పత్తి చేస్తుందని, ఎయిర్‌బ్యాగ్‌లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ల వంటి కీలక భాగాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు