హిమాన్షు కోలుకోవాలని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడి పూజలు
Actor ProfileCelebrity

హిమాన్షు కోలుకోవాలని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడి పూజలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హిమాన్షు కోలుకోవాలని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడి పూజలు
Namasthe Telangana8 Oct 2026
హిమాన్షు కోలుకోవాలని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడి పూజలు

సిరిసిల్ల టౌన్, జూలై 08: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త్వరగా కోలుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశాడు. విద్యానగర్ భక్తాంజనేయ స్వామి ఆలయానికి తన కొడుకుతో వెళ్లి పూజలు నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హిమాన్షు చల్లగా ఉండాలని ప్రార్థించాడు. హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు. స్పోర్ట్స్‌ ఇంజురీ కారణంగా ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేరాడు. కాగా, హిమాన్షు గాయపడిన ఉదంతంపై ఆయన తండ్రి, బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘నా కుమారుడు హిమాన్షు నిన్న సాయంత్రం ఒక చిన్న స్పోర్ట్స్‌ ఇంజ్యూరీకి గురయ్యాడు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతున్నది. మరికొద్ది రోజుల్లోనే తను మామూలు స్థితికి వచ్చేస్తాడు. హిమాన్షు ఆరోగ్యంపై ఆందోళనతో.. ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్న ప్రతి ఒకరికీ ధన్యవాదాలు’ అని కేటీఆర్‌ పేరొన్నారు. మరోవైపు హిమాన్షు సైతం తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌ మీడియా ద్వారా అప్‌డేట్‌ ఇచ్చారు. ‘నిన్న రాత్రి స్పోర్ట్స్‌ ఇంజ్యూరీ కారణంగా నేను దవాఖానలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను బాగున్నాను. కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నాపై మీకున్న ప్రేమ, మద్దతు, నన్ను అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తాను’ అని హిమాన్షు ట్వీట్‌ చేశారు

హ మ న ష క ల క వ లన క ట ఆర ట స ట ల న ర వ హక డ ప జల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in