రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. పాయకరావుపేట అభివృద్ధి కోసం హోం మంత్రి అనిత సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన నాయకులతో కూడా ఆమె సమావేశం నిర్వహించారు. పాయకరావుపేట అభివృద్ధి పథంలో పయనించాలన్నా.. భారీ గ్రాంట్లు రావాలన్నా పురపాలక సంఘంగా మార్చడమే సరైన పద్ధతని ఆమె నాయకులకు వివరించారు.మేజర్ పంచాయతీగా ఉన్న పాయకరావుపేట మున్సిపాలిటీ మారడం సాధ్యమేనా అనే విషయాలను చర్చిస్తే.. ఒక ఊరిని మున్సిపాలిటీగా మార్చాలంటే 30 వేల జనాభా ఉంటే సరిపోతుంది. 2021లో కూడా మున్సిపాలిటీ ప్రతిపాదన వచ్చింది, కానీ అప్పట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 27 వేల మంది మాత్రమే ఉన్నారు. దాంతో పక్కనే ఉన్న పీఎల్‌పురం, అరట్లకోట గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు.READ ALSO తపాలాశాఖ గోల్డెన్ ఛాన్స్.. మీరు లేఖలు రాయగలరా, అయితే రూ. 25 వేలు మీకే!ప్రభుత్వం కూడా అప్పట్లో నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేటలను మున్సిపాలిటీలుగా పేర్కొంటూ జీఓ కూడా విడుదల చేసింది. అయితే, పలు రకాల కారణాలతో చోడవరం, పాయకరావుపేటలను పంచాయతీలుగానే కొనసాగించేందుకు నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణాలు ఏడాదికి రెండుసార్లు ఇంటిపన్ను కట్టాల్సి రావడం, ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోతాయనే కారణాలతో పాయకరావుపేటను మున్సిపాలిటీ చేయకుండా వదిలేశారు. అంతేగాకుండా పీఎల్‌పురం గ్రామస్థులు దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధపడటంతో పాయకరావుపేట మేజర్ పంచాయతీగానే మిగిలిపోయింది.ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం పాయకరావుపేట మున్సిపాలిటీగా చేయడానికి సరిపోతుంది. తాజాగా జనాభా లెక్కల ప్రకారం సుమారు 40 వేల జనాభా ఉంది. దాంతో మిగతా గ్రామాలను కలుపుకోకుండానే పాయకరావుపేటను ఒక్కదానినే మున్సిపాలిటీగా చేయొచ్చు. హోం మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో నిధులకు కొరతే ఉండదు, పైగా కేంద్రం నుంచి కూడా పెద్దఎత్తున నిధులు వస్తాయి. దాంతో
Actor ProfilePolitician
హోం మంత్రి సొంత నియోజకవర్గానికి మహర్దశ.. మున్సిపాలిటీగా పాయకరావుపేట
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Nov 2026
హోం మంత్రి సొంత నియోజకవర్గానికి మహర్దశ.. మున్సిపాలిటీగా పాయకరావుపేట