
ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం… ఇండియాలో సుమారు 110 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. ఈ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. హిందూ జనాభాలో మన పొరుగుదేశం నేపాల్ రెండో స్థానంలో ఉంది. కొన్ని గణాంకాల ప్రకారం నేపాల్‌లో సుమారు 2.86 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. హిందువులు ఎక్కువగా ఉన్నది ఈ రెండు దేశాల్లోనే అని చాలామందికి తెలుసు. మరి వీటి తర్వాతి స్థానాల్లో ఏయే దేశాలు ఉన్నాయో చూద్దాం. హిందువులు అధికంగా గల దేశాల జాబితాలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. డేటా ప్రకారం, ఇక్కడ సుమారు 1.38 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. భారత్, నేపాల్ తర్వాత అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. ఇండోనేషియాలో దాదాపు 42 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద హిందూ జనాభా ఉన్న దేశం. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ, ఇక్కడ హిందూ మతం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా బాలి ద్వీపం హిందూ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ జాబితాలో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. గణాంకాల ప్రకారం, పాకిస్థాన్‌లో సుమారు 40 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. పాకిస్థాన్ ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ, అక్కడ హిందూ సమాజం మతపరమైన మైనారిటీగా ఉంది. దేశంలోని హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు. శ్రీలంకలో సుమారు 31 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశాల జాబితాలో శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశాల్లో అమెరికా, మలేషియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డేటా ప్రకారం, అమెరికాలో సుమారు 25 లక్షల మంది హిందువులు నివసిస్తుండగా, ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది. సుమారు 19