హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్ పోర్ట్ లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Actor ProfilePolitician

హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్ పోర్ట్ లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్ పోర్ట్ లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Asianet News Telugu27 Sept 2026
హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్ పోర్ట్ లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్

తెలంగాణ కు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కేవలం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో జిల్లాల ప్రజలు ఫ్లైట్ జర్నీ కోసం ఎక్కడికి వెళ్లాలన్నా హైదరాబాద్ రావాల్సి వస్తోంది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. తెలంగాణలో ఏవియేషన్ రంగాన్ని భారీగా విస్తరిస్తూ మరో మూడు కొత్త విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లో జరిగిన ఏరోమార్ట్ 2026 సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టుకు ఒక సూపర్ హిస్టరీ ఉంది. 1930లోనే నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని నిర్మించారు. స్వాతంత్య్రానికి పూర్వమే ఇది దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా సేవలు అందించింది. ఇప్పుడు ఈ బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును తిరిగి పునరుద్ధరించనున్నారు. దీనికి సంబంధించి భూసేకరణ, మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే రెండేళ్లలో ఇక్కడ పనులు పూర్తి చేసి, మొదట కార్గో సేవలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల వరంగల్ చుట్టుపక్కల ఉండే టెక్స్‌టైల్, ఐటీ, పారిశ్రామిక రంగాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తాయి. ఉత్తర తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ఆదిలాబాద్‌లో మరో భారీ ఎయిర్‌పోర్ట్ రెడీ అవుతోంది. ఇక్కడ గతంలో వాయుసేన (IAF) రన్‌వే ఉండేది. ఇప్పుడు దానికి అదనంగా భూమిని సేకరించి మొత్తం 1,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎయిర్‌ఫీల్డ్‌ను డెవలప్ చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టును డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ శాఖలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంటే ఇటు మిలిటరీ అవసరాలకు, అటు సామాన్య పౌరుల ప్రయాణాలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా రాబోతోంది

హ దర బ ద వ ళ లక కర ల ద త ల గ ణల మర 3 జ ల ల లక ఎయ ర ప ర ట ల ఈ ప ర త ల ర ప ర ఖల ఛ జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in