హైదరాబాద్ లో 40 లక్షల ఓట్లు గల్లంతు
Actor ProfileCelebrity

హైదరాబాద్ లో 40 లక్షల ఓట్లు గల్లంతు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో 40 లక్షల ఓట్లు గల్లంతు
Eenadu18 Nov 2026
హైదరాబాద్ లో 40 లక్షల ఓట్లు గల్లంతు

తుది దశకు చేరుకున్న సమగ్ర ఓటరు సర్వే 17న ముసాయిదా ఓటరు జాబితా ముద్రణకు ఏర్పాట్లు ఎన్నికల అధికారులకు ఎన్యూమరేషన్‌ ఫారం అందజేస్తున్న గోషామహల్‌ వాసులు ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్‌) కార్యక్రమం సోమవారం ముగియనుండగా.. శనివారం సాయంత్రం వరకు నమోదైన లెక్కల ప్రకారం రాజధాని మూడు జిల్లాల్లోని 28 నియోజకవర్గాల్లో 1.14 కోట్ల ఓటర్లుండగా.. అందులోని 40లక్షల ఓట్లు గల్లంతు కానున్నట్లు అంచనా. ఆది, సోమవారాల్లో ప్రభుత్వ సెలవు అయినప్పటికీ బీఎల్‌వో (బూత్‌ స్థాయి అధికారి) నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లో ఉంటారని, ఇంకా ఎన్యుమరేషన్‌ ఫారాన్ని అందించని వారు ఎవరైనా ఉంటే.. వెంటనే సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ.కర్ణన్‌ సూచించారు. మరోవైపు 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,54,030 ఓట్లు ఉండగా, అందులో 1.16 లక్షల ఓట్లు (45.68శాతం) రద్దు కాబోతున్నాయి. క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌) పరిధిని దృష్టిలో ఉంచుకుంటే.. చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో రద్దయ్యే ఓటర్ల సంఖ్యను మినహాయించాలి. మిగిలిన 25 నియోజకవర్గాల్లో అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలో 21.43, బహదూర్‌పురలో 22.38 శాతం ఓట్లు రద్దు కానున్నాయని అంచనా. రాబోయే రెండ్రోజుల్లో ఈ సంఖ్య 1శాతం పెరగడం లేదా తగ్గడం మాత్రమే జరుగుతుందని, బోనాల పండుగ ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉండవని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ముషీరాబాద్‌-39.77, మలక్‌పేట్‌- 33.92, అంబర్‌పేట్‌- 36.17, ఖైరతాబాద్‌-36.78, జూబ్లిహిల్స్‌- 44.21, సనత్‌నగర్‌- 45.68, నాంపల్లి- 31.33, కార్వాన్‌- 33.23, గోషామహల్‌- 39.38, చార్మినార్‌- 32.49, చాంద్రాయణగుట్ట- 32.57, యాఖుత్‌పుర- 31.40, బహదూర్‌పుర- 22.38, సికింద్రాబాద్‌- 38.47, కంటోన్మెంట్‌లో35.31 శాతం రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం- 21.43, ఎల్బీనగర్‌- 42.19, మహేశ్వరం- 40.03, రాజేంద్రనగర్‌- 38.14, శేరిలింగంపల్లి- 36.60, చేవెళ్ల- 19.31, కల్వకుర్తి- 11.65, షాద్‌నగర్‌