
రూ.1,100 కోట్లతో నిర్మాణం అందుబాటులోకి ఎంసీఆర్ టిమ్స్ ఉచిత కార్పొరేట్ వైద్యం MCR TIMS Hospital: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక మైలురాయిని అధిగమించింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. అందులో భాగంగానే సనత్‌నగర్‌లోని డా.ఎంసీఆర్ టిమ్స్ అందుబాటులోకి వచ్చింది. Monsoon Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. దంచికొట్టనున్న భారీ వర్షాలు ప్రజా సేవకు సిద్దమైన 'డా.ఎంసీఆర్ టిమ్స్': హైదరాబాద్ ఎర్రగడ్డ పరిధిలోని సనత్‌నగర్‌లో 22.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,100 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 'మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(MCR TIMS Hospital)' సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు ఈ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. 1,000 పడకల సామర్థ్యం, 5 ప్రధాన బ్లాకులతో పూర్తిస్థాయి వసతులతో ఈ ఆసుపత్రి సిద్ధమైంది. అత్యాధునిక సేవలు - అధికారుల సమీక్ష: ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ ద్వారా రోజూ 250 మందికి పైగా రోగులకు డే కేర్ సేవలు అందించారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లతో పాటు నూతనంగా రిక్రూట్ అయిన 200 మందికి పైగా వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందించనున్నారు. కాగా, ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కమిషనర్ సంగీత సత్యనారాయణలతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు. భద్రత, హాజరయ్యే వారికి సౌకర్యాల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు