హైదరాబాద్ లో భారీగా సూర్య 'విశ్వనాధ్ సన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే
Actor ProfileActor

హైదరాబాద్ లో భారీగా సూర్య 'విశ్వనాధ్ సన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో భారీగా సూర్య 'విశ్వనాధ్ సన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే
10TV Telugu27 Nov 2026
హైదరాబాద్ లో భారీగా సూర్య 'విశ్వనాధ్ సన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే

Vishwanath And Sons : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వనాధ్ & సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సౌత్ మొత్తం రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కూడా ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు చెన్నై, కేరళ కొచ్చిలో ఈవెంట్స్ నిర్వహించగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తాజాగా ప్రకటించారు. విశ్వనాధ్ & సన్స్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. రేపు ఆగస్టు 11న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Also See : Farnaz Shetty : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్.. ఫర్నాజ్ శెట్టి ఫొటోలు.. విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా చేయనున్నారు. తెలుగులో కూడా సూర్యకు అభిమానులు చాలామంది ఉన్నారని తెలిసిందే. రేపు విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా సూర్య అభిమానులు తరలిరానున్నారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం మొత్తం హాజరవనుంది. గెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని సమాచారం

హ దర బ ద ల భ ర గ స ర య వ శ వన ధ సన స ప ర ర ల జ ఈవ ట ఎప ప డ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in