
Telangana Government : హైదరాబాద్ నగరంలో ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను నిర్మించి ఇస్తోంది. 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న మొత్తం 7,340 ఇళ్ల కోసం ఆగస్టు 10వ తేదీ వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటికోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.స అయితే, వరుసగా సెలవులు రావడంతో చాలా మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం తమ దరఖాస్తులను గడువులోపు సమర్పి పోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. వరుస సెలవులు రావడంతో గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఇదిలాఉంటే.. ఎల్‌ఐజీ ఇళ్ల కోసం సోమవారం వరకు సుమారు 46 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో హైదరాబాద్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ LIG ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 525 చదరపు అడుగులు. ఒక్కో ఫ్లాట్ మొత్తం వ్యయం రూ.11 లక్షలుగా ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ భరిస్తుంది. లబ్ధిదారుడు మిగిలిన రూ.6 లక్షలను చెల్లించాల్సి ఉంటుంది